విలక్షణ నటుడు కృష్ణంరాజు

ABN , First Publish Date - 2022-09-19T05:54:53+05:30 IST

తనదైన శైలిలో విభిన్న పాత్రల ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొన్న విలక్షణ నటుడు కృష్ణం రాజు అని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

విలక్షణ నటుడు కృష్ణంరాజు
సభలో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

మాజీ మంత్రి కన్నా

గుంటూరు (సాంస్కృతికం), సెప్టెంబరు18: తనదైన శైలిలో విభిన్న పాత్రల ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొన్న విలక్షణ నటుడు కృష్ణం రాజు అని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక బ్రాడీ పేటలోని ఓ హోటల్‌లో కృష్ణంరాజు ఫ్యాన్స అండ్‌ కల్చ రల్‌ అసోసియేషన ఆధ్వర్యంలో ఆదివారం ఇటీవల మృతి చెందిన సినీ నటుడు కృష్ణంరాజు సంతాప సభ జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు సేవలు అందించారని కొనియాడారు. ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, కేఎల్‌సీ లక్ష్మణరావులు ప్రసంగించారు. సభకు కన్నా సంస్థల అధినేత కన్నా మాస్టారు అధ్యక్షత వహించారు. సభలో సంస్థ వ్యవస్థాపకుడు జొన్నలగడ్డ శ్రీరామచంద్రశాసి్త్ర, పాత్రికేయుడు నిమ్మరాజు చలపతిరావు, కార్పోరేటర్‌ ఈచంపాటి వెంకట కృష్ణ, ఆర్‌ లక్ష్మీ పతి, సీతారామయ్య చౌదరి, పుల్లా సుందరబాబు, పి.సూరి, కోట శేషగిరి, రాళ్ళబండి రాజేంద్రప్రసాద్‌, రాళ్ళబండి శివరామకృష్ణ  పాల్గొని కృష్ణంరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

Read more