వైసీపీ పుట్టుకే ఒక ఫేక్‌

ABN , First Publish Date - 2022-06-11T05:54:10+05:30 IST

ఆరవ తరగతి ఆరుసార్లు తప్పిన కొడాలి నాని జూమ్‌ కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేయవద్దని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చదివిన లోకేశ్‌కు చెప్పడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మండిపడ్డారు.

వైసీపీ పుట్టుకే ఒక ఫేక్‌

 కనపర్తి శ్రీనివాసరావు


గుంటూరు(తూర్పు), జూన్‌10: ఆరవ తరగతి ఆరుసార్లు తప్పిన కొడాలి నాని జూమ్‌ కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేయవద్దని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చదివిన లోకేశ్‌కు చెప్పడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మండిపడ్డారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీమంత్రి హోదాలో ఉండి ఇతరుల పేరుతో లాగిన్‌ అయ్యే నీచస్ధితికి కొడాలినాని దిగజారడం దుర్మార్గమన్నారు. క్యాసినో, పేకాటలు నిర్వహించేవారికి జూమ్‌ సమావేశాల విలువ ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. గతంలో అనేకసార్లు  వైసీపీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి దేవేంద్రరరెడ్డి నకిలీ ఐడీలతో చొరబడి ఆటంకం కలిగిస్తే కోర్టులు మందలించిన విషయం అందరికి తెలిసిందే నని అన్నారు. వైసీపీ పుట్టుకే ఒక ఫేక్‌ అని విమర్శించారు. చంద్రబాబు నిబద్దత కలిగిన వ్యక్తి కాబట్టే లోకేశ్‌కు కేసుల బాధ లేదన్నారు. పదోవతరగతి తప్పామన్నా బాధలో చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చాల్సిన సమయంలో ప్రభుత్వం ఇటువంటి నీచసంస్కృతికి తెరలేపడం అత్యంత దుర్మార్గమన్నారు. నిన్నటివరకు పదవి పోయిందన్న బాధలో పశువుల కొట్టంలో మద్యం మత్తులో మునిగి తేలిన గుట్కా నాని తాడేపల్లి ప్యాలెస్‌ విసిరిన కుక్క బిస్కెట్లుకు ఆశపడి మళ్ళీ బయటకు వచ్చాడని ఎద్దేవా చేశారు. సమావేశంలో జిల్లా టీడీపీ నాయకులు అడకా శ్రీనివాసరావు, మేళం సైదయ్య తదితరులు  పాల్గొన్నారు.   

Read more