మరోసారి జిన్నా టవర్ వివాదం.. జాతీయ జెండా తొలగింపు..

ABN , First Publish Date - 2022-02-23T16:21:44+05:30 IST

గుంటూరు: నగరంలో మరోసారి జిన్నా టవర్ వివాదం తెరపైకి వచ్చింది.

మరోసారి జిన్నా టవర్ వివాదం.. జాతీయ జెండా తొలగింపు..

గుంటూరు: నగరంలో మరోసారి జిన్నా టవర్ వివాదం తెరపైకి వచ్చింది. టవర్ దగ్గర ఉన్న జాతీయ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీంతో గుంటూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. జిన్నా టవర్ పేరు మార్చాలని బీజేపీ ఆందోళన నిర్వహిస్తోంది. అబ్దుల్ కలాం టవర్‌గా మార్చాలని, టవర్‌పై జాతీయ జెండా ఎగురవేయాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో వివాదం ముదరడంతో కార్పొరేషన్ అధికారులు జిన్నా టవర్‌కు జాతీయ రంగులు వేయించారు. అక్కడే జెండా దిమ్మ ఏర్పాటు చేసి, జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రితో సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఇప్పుడు దిమ్మెతో సహా జాతీయ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీంతో మళ్లీ ఏం జరుగుతుందోనని స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - 2022-02-23T16:21:44+05:30 IST