-
-
Home » Andhra Pradesh » Guntur » jc dineshkumar-MRGS-AndhraPradesh
-
ఉద్యోగుల వివరాలు, మౌలిక వసతులు పోర్టల్‌లో అప్లోడింగ్ చేయాలి
ABN , First Publish Date - 2022-02-20T05:17:42+05:30 IST
కొత్తగా ఏర్పాటు చేస్తోన్న బాపట్ల, పల్నాడు జిల్లాతో పాటు అవశేష గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, మౌలిక వసతుల వివరాలను ఆంధ్రప్రదేశ్ జిల్లా పునర్విభజన పోర్టల్‌లో త్వరితగతిన అప్ లోడ్ చేయాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు.

కొత్త జిల్లాల ఏర్పాటుపై జేసీ సమీక్ష
భవనాలు, మౌలిక సదుపాయాలపై నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశం
గుంటూరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): కొత్తగా ఏర్పాటు చేస్తోన్న బాపట్ల, పల్నాడు జిల్లాతో పాటు అవశేష గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, మౌలిక వసతుల వివరాలను ఆంధ్రప్రదేశ్ జిల్లా పునర్విభజన పోర్టల్‌లో త్వరితగతిన అప్ లోడ్ చేయాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, మౌలిక వసతుల వివరాలు నమోదుపై జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ డీఆర్పీ పోర్టల్‌లో ఆయా శాఖల ఉద్యోగుల వివరాలు, భవనాలు, మౌలిక వసతులు నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లాల వారీగా నమోదు చేయాలన్నారు. అలానే నూతనంగా ఏర్పాటు చేసే జిల్లాల్లో శాఖలకు సంబంధించి అందుబాటులోవున్న, సమకూర్చుకోవాల్సిన భవనాలు, కల్పించాల్సిన వసతులు, ఉద్యోగులపై నివేదిక సిద్ధం చేసి అందించాలన్నారు. ఇందుకోసం ప్రతి శాఖలోనూ జిల్లాకు ఒక ఉద్యోగిని నోడల్ అధికారిగా నియమించి పని వేగంగా జరిగేలా చూడాలన్నారు. కొత్త జిల్లాలకు స్పెషల్ కలెక్టర్ స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించినట్లు తెలిపారు. నూతన జిల్లాల ఏర్పాటుపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రచార సాధనాల ద్వారా విస్త్రృత ప్రచారం కల్పించాలన్నారు. సమావేశంలో తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీన, జిల్లా రెవెన్యూ అధికారి పీ.కొండయ్య, పులిచింతల ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ వినాయకం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.