AP News: మా వాళ్లను వేధించడమే జగన్ లక్ష్యం : నారా లోకేష్

ABN , First Publish Date - 2022-10-01T22:40:18+05:30 IST

Amaravathi: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. టీడీపీ నేతలను వేధించడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉంటున్న అయన్నపాత్రుడు కుమారుడు చింతకాయల రవి ఇంటికి చేరుకుని ఆయన్ను అరెస్టు చేసేందుకు యత్నించడం

AP News:  మా వాళ్లను వేధించడమే జగన్ లక్ష్యం : నారా లోకేష్

Amaravathi: టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) జగన్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. టీడీపీ నేతలను వేధించడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉంటున్న అయన్నపాత్రుడు కుమారుడు చింతకాయల రవి ఇంటికి చేరుకుని  ఆయన్ను అరెస్టు చేసేందుకు యత్నించడం దారుణమని పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఇంట్లోకి చొరబడి, కుటుంబ సభ్యులు, ఇంట్లో పని‌చేసే వారి‌పై బెదిరింపులకు పాల్పడటాన్ని లోకేష్ తీవ్రంగా ఖండించారు. నిత్యం నేరాలు - ఘోరాలు చేస్తున్న వైసీపీ (YSRCP) నేతలకు సన్మానాలు చేసి పదవులు కట్ట బెట్టడం జగన్ ప్రభుత్వ దౌర్భాగ్యమని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న టీడీపీ నేతల‌పై అక్రమ కేసులు పెట్టి జగన్ రాక్షసానందం పొందుతున్నాడని, అయన్నపాత్రుడి కుటుంబాన్ని టచ్ చేసిన ఏ ఒక్కరిని వదిలి పెట్టమని లోకేష్ హెచ్చరించారు. 


ఏపీ పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విజయ్ కుటుంబ సభ్యులు. ఎందుకు వచ్చారో, కేసు ఏంటో కూడా చెప్పకుండానే..ఇంట్లో పిల్లలు ఉన్న సయమంలో హల్‌చల్ చేశారని పేర్కొన్నారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే సోదాలు నిర్వహించడంతో పాటు తమను బెదిరించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై న్యాయ పోరాటం సాగిస్తామని చెప్పారు విజయ్ కుటుంబ సభ్యులు.


6న హాజరుకావాలంటూ.. ఏపీ సీఐడీ పోలీసుల నోటీసు

చింతకాయల విజయ్  హైదరాబాద్‌ బంజారాహిల్స్‌‌ సమీపంలో నివాసం ఉంటున్నారు. శనివారం  ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయానికి విజయ్ ఇంట్లో లేరు. అయినా ఇంట్లోకి ప్రవేశించి.. సోదాలు చేశారు. విజయ్  లేకపోవడంతో సర్వెంట్‌ను అదుపులోకి తీసుకుని ఆయన ఇంటికి నోటీసు అంటించారు సీఐడీ పోలీసులు. ఈ నెల 6వ తేదీన 10:30 గంటలకు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించారు. U/s 66(c) of it act, సెక్షన్ 419,469,153(a)505(2), 120(b)r/w 34 IPC యాక్ట్ కింద విజయ్‌పై సీఐడీ సైబర్ క్రైమ్ పీఎస్‌లో కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నెంబర్స్, మోబైల్ ఫోన్స్‌తో పాటు, ఐడి, అడ్రస్ ప్రూఫ్‌తో హాజరు కావాలని ఆదేశించారు. హాజరు కాని పక్షంలో 41A(3), (4) crpc సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయాల్సి ఉంటుందని నోటీసులో వార్నింగ్ ఇచ్చారు.

Updated Date - 2022-10-01T22:40:18+05:30 IST