అమరావతిపై విద్వేష క్రీడ సరికాదు

ABN , First Publish Date - 2022-09-27T06:05:40+05:30 IST

పరిపాలన సౌలభ్యం కోసం ఒకే రాజధాని ఉండాలని, అమరావతిపై విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రభుత్వానికి మంచిది కాదని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, యూపీఏ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్‌ కేఎం ఖాదిర్‌ మొహిద్దీన్‌ అన్నారు.

అమరావతిపై విద్వేష క్రీడ సరికాదు
సభలో మాట్లాడుతున్న ఖాదీర్‌ మొహిద్దీన్‌, పాల్గొన్న పార్టీ నాయకులు

ఐయూఎంఎల్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఎం ఖాదిర్‌ మొహిద్దీన్‌


గుంటూరు(తూర్పు), సెప్టెంబరు26: పరిపాలన సౌలభ్యం కోసం ఒకే రాజధాని ఉండాలని, అమరావతిపై విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రభుత్వానికి మంచిది కాదని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, యూపీఏ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్‌ కేఎం ఖాదిర్‌ మొహిద్దీన్‌ అన్నారు. గుంటూరులోని పట్టాభిపురంలో సోమవారం జరిగిన ఆ పార్టీ రాష్ట్ర ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలన్నారు. నిబంధనలు సాకుగా చూపి ముస్లింలకు సంక్షేమ పథకాలు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బషీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ వక్ఫ్‌బోర్డులో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా హైకోర్టులో పోరాడతామని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు ఖాజావలి, జుబైర్‌, పైసల్‌బాబు, షాజు, అమానుల్లాఖాన్‌, రహమతుల్లా, షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more