AP News: అమరావతిపై నాకు ఎలాంటి కోపం లేదు : ముఖ్యమంత్రి జగన్

ABN , First Publish Date - 2022-09-15T23:20:58+05:30 IST

Amaravathi: ముఖ్యమంత్రి వైఎస్ (CM Jagan) జగన్ శాసనసభలో పాలన వికేంద్రీకరణపై సుధీర్ఘంగా ప్రసంగించారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అమరావతి (Amaravathi) కోసం వెయ్యి రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని కృత్రిమ ఉద్యమమని కొట్టిపడేశారు. ఇతర ప్రాంతాల వారి మనో

AP News: అమరావతిపై నాకు ఎలాంటి కోపం లేదు : ముఖ్యమంత్రి జగన్

Amaravathi: ముఖ్యమంత్రి వైఎస్ (CM Jagan) జగన్ శాసనసభలో పాలన వికేంద్రీకరణపై సుధీర్ఘంగా ప్రసంగించారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అమరావతి (Amaravathi) కోసం వెయ్యి రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని కృత్రిమ ఉద్యమమని కొట్టిపడేశారు. ఇతర ప్రాంతాల వారి మనోభావాలను రెచ్చగొట్టేలా ఉద్యమం నడుస్తుందని ఆరోపించారు. పెత్తందార్లు, పెట్టుబడిదారుల కోసం ఉద్యమం పనిచేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు హయంలో ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఎందుకు లేవో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు (Chandra Babu) హయంలో 31 లక్షల ఇళ్ళపట్టాలు, 21 లక్షల ఇళ్ళ నిర్మాణం ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ డబ్బులన్ని ఎక్కడికిపోయాయి, ఎలా పోయాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.   


‘‘ఇక్కడ రాజధాని వద్దని నేను అనలేదు.’’

‘‘అమరావతిపై నాకు ఎలాంటి కోపం లేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అందులో భాగంగా కర్నూలు, విశాఖలను యాడ్ చేయాలనుకున్నా. రాజధాని నిర్మాణానికి రూ. 4 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల వరకు ఖర్చు అవుతుందని చంద్రాబాబే చెప్పారు. టీడీపీ ఐదేళ్ల పదవీకాలంలో గ్రాఫిక్స్ చూపించి జనాన్ని మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టాలి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సంవత్సరానికి రూ. వెయ్యి కోట్లు కూడా ఖర్చు చేయలేదు. రూ. 2290 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళారు. అమరావతి రాజధాని అనేది ఓ స్వప్నాల వేట మాత్రమే... ఇది వందేళ్ళయినా పూర్తికాదు.’’ అని జగన్ వ్యాఖ్యానించారు.  

Updated Date - 2022-09-15T23:20:58+05:30 IST