UTF తలపెట్టిన చలో సీఎంవోకు అనుమతి లేదు: ఎస్పీ

ABN , First Publish Date - 2022-04-24T18:43:00+05:30 IST

యూటీఎఫ్ తలపెట్టిన ఛలో సీఎంవోకు అనుమతి లేదని గుంటూరు జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ అన్నారు.

UTF తలపెట్టిన చలో సీఎంవోకు అనుమతి లేదు: ఎస్పీ

గుంటూరు జిల్లా: యూటీఎఫ్ తలపెట్టిన ఛలో సీఎంవోకు అనుమతి లేదని గుంటూరు జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీపీఎస్ రద్దు కోరుతూ ఈ నెల 25న సీఎం కార్యాలయం ముట్టడికి యూటీఎఫ్ సిద్దమైందని... ఈ నేపథ్యంలో అసాంఘీక శక్తులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందన్నారు. అందుచేత యూటీఎఫ్ నాయకులు, ఉద్యోగులు ఎవ్వరూ ఈ కార్యక్రమంలో పాల్గొనరాదని ఎస్పీ సూచించారు.

Updated Date - 2022-04-24T18:43:00+05:30 IST