ప్రైవేటు వైద్యశాలల్లో మాక్‌ డ్రిక్‌ నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-09-17T06:10:01+05:30 IST

జిల్లాలో ప్రైవేటు వైద్యశాలల్లో ముందస్తు జాగ్రత్తగా అగ్నిమాపక పరికరాల పనితీరును పరిశీలించేందుకు అన్ని మాక్‌డ్రిక్‌ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ప్రతాప్‌ మాదిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ప్రైవేటు వైద్యశాలల్లో మాక్‌ డ్రిక్‌ నిర్వహించాలి
ప్రసంగిస్తున్న డైరెక్టర్‌ జనరల్‌ ప్రతాప్‌ మాదిరెడ్డి

అగ్నిమాపక శాఖ డీజీ ప్రతాప్‌ సూచన

గుంటూరు(మెడికల్‌), సెప్టెంబరు 16: జిల్లాలో ప్రైవేటు వైద్యశాలల్లో ముందస్తు జాగ్రత్తగా అగ్నిమాపక పరికరాల పనితీరును పరిశీలించేందుకు అన్ని మాక్‌డ్రిక్‌ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ప్రతాప్‌ మాదిరెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం రాత్రి  ఐఎంఏ హాలులో ’అగ్నిమాపక సమస్యలు- ఆధునిక పరిష్కార మార్గాలు’ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అగ్నిమాపక శాఖ పరిధిలో ఉన్న కొన్ని అధికారాలను డీఎంహెచ్‌వోలకు, మున్సిపల్‌ అధికారులకు, విద్యుత్తుశాఖ అధికారులకు బదలాయించినట్లు ఆయన తెలిపారు.  ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ సి.శ్రీనివాసరాజు, ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ జి.నందకిషోర్‌, ఐఎంఏ ప్రతినిధులు గజ్జల బ్రహ్మారెడ్డి, ఎం.సుభాష్‌ చంద్రబోస్‌, పి.అనిల్‌కమార్‌, వై.సుబ్బారాయుడు, టి.సేవకుమార్‌, డి.అమర్‌లింగేశ్వరరావుతో పాటు గుంటూరు, రేపల్లె, తెనాలి, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి  ఐఎంఏ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read more