AP News : వైసీపీ విధానాల వల్లే విద్యుత్ కొన్నాలన్నా.. దొరకని దుస్థితి

ABN , First Publish Date - 2022-08-16T22:17:25+05:30 IST

Amaravathi: టీడీపీ (TDP) హయాంలో అనేక విద్యుత్ సంస్కరణలు తెస్తే.. అవి వైసీపీ (YSRCP) పాలనలో వాటిని రద్దు చేయడంతో జనం ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి (GV Reddy) పేర్కొన్నారు. తమ పార్టీ హయాంలో చేసుకున్న విద్యుత్

AP News : వైసీపీ విధానాల వల్లే విద్యుత్ కొన్నాలన్నా.. దొరకని దుస్థితి

Amaravathi: టీడీపీ (TDP) హయాంలో అనేక విద్యుత్ సంస్కరణలు తెస్తే.. అవి వైసీపీ (YSRCP) పాలనలో వాటిని రద్దు చేయడంతో జనం ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి (GV Reddy) పేర్కొన్నారు. తమ పార్టీ హయాంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయడంతో నేడు విద్యుత్ కొనాలన్నా.. దొరకని పరిస్థితి  నెలకొందన్నారు. ఇప్పటికే 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. టీడీపీ చేసిన బకాయిలు మేం తీరుస్తున్నామని చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని, విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేదని చెప్పారు. జగన్ పాలనలో ఎప్పుడు జీతాలు వస్తాయో?, ఎప్పుడు ఉద్యోగాలు ఊడతాయో తెలియదు పరిస్థితి నెలకొందన్నారు. తెస్తున్న అప్పులు, సర్ చార్జీలు, పన్నుల ద్వారా వసూలు చేస్తున్న నిధులు ఏమౌతున్నాయని ప్రశ్నించారు. 

Updated Date - 2022-08-16T22:17:25+05:30 IST