-
-
Home » Andhra Pradesh » Guntur » Dont put YSR statue there High Court mvs-MRGS-AndhraPradesh
-
AP News: అక్కడ వైఎస్ఆర్ విగ్రహం పెట్టకండి: హైకోర్టు
ABN , First Publish Date - 2022-08-30T21:46:55+05:30 IST
Amaravathi: పల్నాడు (Palnaadu) జిల్లా నరసరావుపేట(Narasarao Pet) మయూరి సెంటర్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం (YSR Statu) ఏర్పాటుకు ఇటీవల భూమి పూజ జరిగింది. అయితే ప్రజలు తిరిగే స్థలంలో విగ్రహం పెడితే ఇబ్బంది పడాల్సి వస్తోందని నరసరావుపేటకు చెందని గూడూరి శేఖర్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ప్రజలు ఉపయోగించే స్థలాల్లో అనుమతి లేకుండా విగ్రహాలు పెట్టవద్దని సుప్రీంకోర్టు

Amaravathi: పల్నాడు (Palnaadu) జిల్లా నరసరావుపేట(Narasarao Pet) మయూరి సెంటర్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం (YSR Statu) ఏర్పాటుకు ఇటీవల భూమి పూజ జరిగింది. అయితే ప్రజలు తిరిగే స్థలంలో విగ్రహం పెడితే ఇబ్బంది పడాల్సి వస్తోందని నరసరావుపేటకు చెందని గూడూరి శేఖర్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ప్రజలు ఉపయోగించే స్థలాల్లో అనుమతి లేకుండా విగ్రహాలు పెట్టవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ..అనధికారికంగా విగ్రహాలు పెట్టేందుకు వీలులేదని పల్నాడు జిల్లా కలెక్టర్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. విగ్రహం పెట్టే ముందు అధికారులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది.