-
-
Home » Andhra Pradesh » Guntur » Deendayal is not only a politician also a nationalist Governor mvs-MRGS-AndhraPradesh
-
AP News: దీన్‌దాయల్ రాజకీయనేత మాత్రమే కాదు.. జాతీయవాది కూడా : గవర్నర్
ABN , First Publish Date - 2022-09-25T18:47:15+05:30 IST
Vijayawada: గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ విజయవాడలో పండిట్ దీన్ దయాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. వినికిడి లోపం ఉన్నవారికి వినికిడి యంత్రాలను అందజేశారు. దీన్ దయాల్

Vijayawada: గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ విజయవాడలో పండిట్ దీన్ దయాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. వినికిడి లోపం ఉన్నవారికి వినికిడి యంత్రాలను అందజేశారు. దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీన్ దయాల్ జీవితం ఎంతో విలువలతో కూడుకున్నదని, ఆయన కేవలం రాజకీయనేత మాత్రమే కాదని.. జాతీయవాది కూడా అని పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత...అవగాహన కలిగిన మహోన్నత వ్యక్తి దీన్ దయాల్ అని కొనియాడారు. దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.