రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ హవల్దార్‌ మృతి

ABN , First Publish Date - 2022-10-12T06:07:36+05:30 IST

రోడ్డు ప్రమాదంలో రిటైర్టు హవల్దార్‌ మృతి చెందిన ఘటన మంగళవారం మంగళవారం ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం పరిధిలోని నవాబ్‌పేట వద్ద జరిగింది.

రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ హవల్దార్‌ మృతి
గంగసాని హరికృష్ణ (ఫైల్‌ ఫొటో)

వట్టిచెరుకూరు, అక్టోబరు11: రోడ్డు ప్రమాదంలో రిటైర్టు హవల్దార్‌ మృతి చెందిన ఘటన మంగళవారం మంగళవారం ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం పరిధిలోని నవాబ్‌పేట వద్ద జరిగింది. సేకరించిన వివరాల మేరకు.. మండలంలోని అనంతవరప్పాడు గ్రామానికి చెందిన గంగసాని హరికృష్ణ(38) ఆర్మీలో పనిచేసిన మూడేళ్ల కిందట రిటైర్డు అయి జగ్గయ్యపేట సమీపంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ద్విచక్రవాహనంపై వెళుతుండగా డివైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె కలరు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అనంతవరప్పాడుకు తరలించారు.  

Read more