పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-10-08T06:19:10+05:30 IST

: పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గుండ్లపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది.

పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య

మేడికొండూరు, అక్టోబర్‌7: పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గుండ్లపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వింజనంపాడుకు చెందిన పైనేని తాతారావు తన భార్య నాగమల్లేశ్వరి(45)తో కలసి వ్యవసాయం చేసుకుంటూ గత కొన్నేళ్లుగా గుండ్లపాలెం గ్రామంలో నివసిస్తున్నారు. శుక్రవారం నాగమల్లేశ్వరి తన మరిదికి ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఫోన్‌ పెట్టేసింది. అప్రమత్తమైన మరిది తన అన్న తాతారావుకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. ఆ సమయంలో గుంటూరులో ఉన్న తాతారావు గుండ్లపాలెం చేరుకొని ఇంట్లోకి వెళ్లి చూడగా నాగమల్లేశ్వరి పడిఉంది. పక్కనే పురుగుమందు డబ్బా పడి ఉండడంతో ఆమె పురుగుమంది తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల పొలం గట్ల వద్ద జరిగిన వివాదంలో ఇదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నాగమల్లేశ్వరిని కొట్టాడని, దీనిని అవమానంగా భావించి కొద్ది రోజులుగా ఆమె ఎవరితోను మాట్లాడకుండా ఇంట్లోనే ఉంటూ మనస్థాపంలో శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిందని భర్త తాతారావు పోలీసులకు తెలిపాడు.  

Read more