మహిళా ఎస్‌ఐ ఇంటిపై దాడి

ABN , First Publish Date - 2022-09-13T05:42:49+05:30 IST

స్థానిక నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్‌ఐ తరంగిణి ఇంటిపై అ సాంఘిక శక్తులు దాడి చేయటం కలకలం రేపింది.

మహిళా ఎస్‌ఐ ఇంటిపై దాడి

  •  కారు అద్దాలు ధ్వంసం


 గుంటూరు, సెప్టెంబరు 12: స్థానిక నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్‌ఐ తరంగిణి ఇంటిపై అ సాంఘిక శక్తులు దాడి చేయటం కలకలం రేపింది. ఆమె ఆదివారం రాత్రి విధినిర్వహణలో భాగంగా రాత్రిగస్తీ తిరుగుతున్నారు. ఈ క్రమంలో రెడ్డిపాలెం గ్రామ పరిధిలో బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతున్న వారిని హెచ్చరించగా వారు ఆమెపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఆమె వారి వాహనం ఫొటోలను తీసి వెనక్కు వచ్చేశారు. అనంతరం అక్కడకు సమీపంలోని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో గల అపార్టుమెంట్‌లోని తన ఫ్లాట్‌కు వెళ్ళిపోయారు. అయితే నిందితులు ఆమె వెంటే అనుసరించి అపార్టుమెంట్‌కు చేరుకున్నారు. ఆమె తన ఫ్లాటులోకి వెళ్ళిపోగానే ఆమె కారు అద్దాలను ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన వాచ్‌మెన్‌పై కూడా దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనపె ఎస్‌ఐ నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఏ మాత్రం భయం లేని నిందితులు మరోసారి ఆమె కారు అద్దాలు ధ్వంసం చేసి అపార్టుమెంట్‌ వాసులను భయ భ్రాంతులకు గురి చేశారు. నిందితులను తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన భీమనేని అరవింద ప్రభు, బొమ్మిశెట్టి రాముగా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేశారు .

Updated Date - 2022-09-13T05:42:49+05:30 IST