-
-
Home » Andhra Pradesh » Guntur » collector-NGTS-AndhraPradesh
-
పథకాలను సమర్ధంగా అమలు చేయాలి
ABN , First Publish Date - 2022-04-24T05:40:50+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి వివిధ ప్రభుత్వ ఫశాఖల అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ ఎం వేణుగోపాల్‌రెడ్డి
గుంటూరు, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి వివిధ ప్రభుత్వ ఫశాఖల అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. తొలుత నాబార్డు ఆధ్వర్యంలో రూపొందించిన కిసాన్ క్రెడిట్ కార్డు, గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం మండలాల వారీగా ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతున్న తీరుని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వీక్షించారు. అధికారులంతా సమన్వయంతో ప్రతీ ప్రభుత్వ పథకంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వారంలో మూడు రోజులు గ్రామం నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల నుంచి వస్తున్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. ఇక నుంచి ప్రతీ సోమవారం జరిగే స్పందన గ్రీవెన్స్‌కు జిల్లా, డివిజన్, మండల స్థాయి అదికారులు పాల్గొనాలని ఆదేశించారు. గతంలో కంటే మెరుగ్గా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. జిల్లా మొత్తం వారంలో పూర్తిస్థాయి పురోగతి కనపించాలన్నారు. ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి మంజూరు చేసిన అభివృద్ధి పనులు సత్వరం పూర్తి చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ఒకరికొకరు పరస్పరం చర్చించుకొంటూ త్వరితగతిన పథకాలను ప్రజలకు చేరువ చేయాలన్నారు. సమావేశంలో తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీన, గుంటూరు ఆర్డీవో ప్రభాకర్రెడదద్డి, జడ్పీ సీఈవో డాక్టర్ కే శ్రీనివాసరెడ్డి, డీపీవో కేశవపెడ్డి, హౌసింగ్ పీడీ సాయినాథ్‌కుమార్, పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ బ్రహ్మయ్య, సర్వే ఏడీ నాయక్, రూరల్ వాటర్ సర్వీసు అధికారులు పాల్గొన్నారు.