-
-
Home » Andhra Pradesh » Guntur » chandrababu naidu comments anr-MRGS-AndhraPradesh
-
Chandrababu: దేశ సేవకు పునరంకితం కావాల్సిన సమయం ఇది..
ABN , First Publish Date - 2022-08-15T16:43:48+05:30 IST
చేబ్రోలులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ సభ జరిగింది.

గుంటూరు (Guntur): తెలుగుదేశం ఆధ్వర్యంలో చేబ్రోలులో ఆజాదీ కా అమృత్ మహోత్సవ సభ (Azadi Ka Amrit Mahotsava Sabha) జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu), ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు జాతీయ జెండాను (National Flag) ఆవిష్కరించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను స్మరించుకుందామన్నారు.
75 ఏళ్ల స్వతంత్రం సందర్భంగా అజాదీ కా అమృత్ మహోత్సవాలు అందరం ఘనంగా జరుపుతున్నామని చంద్రబాబు అన్నారు. దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు అందరం కలిసి పని చేయాలని, స్వతంత్ర్యం కోసం నాయకులు చేసిన త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలన్నారు. చాలామంది తమ ప్రాణాలను, ఆస్తులను త్యాగం చేశారని, గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, పటేల్, అజాద్ వంటి వారు పోరాటం చేశారని, భగత్ సింగ్, అల్లూరి వంటి వారు విప్లవ పంతాలో పోరాడారన్నారు. అందరూ పోరాడి తెచ్చిన స్వాతంత్ర్యం ఇదని, దేశ చరిత్రలో మిగిలి పోయేలా జాతీయ పతాకాన్ని తయారు చేసిన పింగళి వెంకయ్యను గుర్తు చేసుకుందామని, దేశ సేవకు పునరంకితం కావాల్సిన సమయం ఇదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.