-
-
Home » Andhra Pradesh » Guntur » bollimantha puraskaram-MRGS-AndhraPradesh
-
సాహిత్యానికి సాంకేతిక విజ్ఞానం జోడించాలి
ABN , First Publish Date - 2022-06-08T05:13:48+05:30 IST
భావి తరాలకు సాహిత్యం చేరేందుకు సాంకేతిక విజ్ఞానం జోడించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ పోలా భాస్క ర్ పేర్కొన్నారు.

ఐఏఎస్ అధికారి పోలా భాస్కర్
బొల్లిముంత సాహితీ పురస్కారాల ప్రదానం
తెనాలి అర్బన్, జూన్ 7: భావి తరాలకు సాహిత్యం చేరేందుకు సాంకేతిక విజ్ఞానం జోడించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ పోలా భాస్క ర్ పేర్కొన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతున్న తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవ సభలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. పూర్వ శాస్త్రవేత్త చందు సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ పురస్కారాల ను ఉత్తరాంధ్ర కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు, సినీ రచయి త ఎం.సంజీవిలకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న సమాజానికి అనుగుణంగా సాహిత్యం ప్రజలకు చేరేందుకు అవసరమైన మార్గాన్ని అన్వేషించాలన్నారు. ఆధునికి సమా జంలో సాహిత్యం అవశ్యకత అనే అంశంపై సాహిత్యవేత్త నాగసూరి వేణుగోపాల్ ప్రసంగించారు. పలువురు కళాకారులు, స్వచ్ఛంద సేవకులను ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఎం.సత్యనారాయణశెట్టి, అంబటి మురళీకృష్ణ, చందు సుబ్బారావు ప్రసంగించారు. కాట్రపాడు ఉషోదయ కళానికేతన్ కళాకారులు ప్రదర్శించిన వసంతం నాటిక అలరించింది. ఫౌండేషన్ సభ్యులు కనపర్తి మధుకర్, బెన్‌హర్, వెంకట్, బొల్లిముంత కృష్ణ తదితరులు పర్యవేక్షించారు.