15మంది అధికారులకు షోకాజు నోటీసులు

ABN , First Publish Date - 2022-10-11T06:08:17+05:30 IST

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి హాజరు కాని 15మంది జిల్లా అధికారులకు బాపట్ల జిల్లా కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ షోకాజు నోటీసులిచ్చారు.

15మంది అధికారులకు షోకాజు నోటీసులు

 బాపట్ల, అక్టోబరు 10 : అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి హాజరు కాని 15మంది జిల్లా అధికారులకు బాపట్ల జిల్లా కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ షోకాజు నోటీసులిచ్చారు. జిల్లా కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి అధికారులు హాజరు కాకుండా సిబ్బందిని పంపించటం పట్ల కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. 

Read more