రూ.పది ఇచ్చి వంద కొట్టేస్తున్నారు

ABN , First Publish Date - 2022-09-28T06:09:28+05:30 IST

రాష్ట్రప్రభుత్వం అడ్డగోలుగా పన్నులు పెంచుతూ, సంక్షేమం పేరుతో కుడిచేత్తో పది రూపాయలిచ్చి, ఎడమచేత్తో వంద రూపాయలు కొట్టేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు.

రూ.పది ఇచ్చి వంద కొట్టేస్తున్నారు
అగ్రహారంలోని చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్న నారా లోకేశ్‌

బాదుడే.. బాదుడులో పాలకులపై లోకేశ్‌ ధ్వజం

దుగ్గిరాల, సెప్టెంబరు 27: రాష్ట్రప్రభుత్వం అడ్డగోలుగా పన్నులు పెంచుతూ, సంక్షేమం పేరుతో కుడిచేత్తో పది రూపాయలిచ్చి, ఎడమచేత్తో వంద రూపాయలు కొట్టేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. బాదుడే.. బాదుడు కార్యక్రమంలో భాగంగా మండలంలోని డీపీఅగ్రహారంలో మంగళవారం ఆయన ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెసుకున్నారు. ఈ సందర్భంగా చర్చిలో లోకేశ్‌ ప్రార్థనలు చేశారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నందం అబద్ధయ్య, గూడూరు వెంకట్రావు, కేసంనేని శ్రీఅనిత, తాళ్ల అశోక్‌, పరిశీలకులు ఎంవీఎం సత్యనారాయణ, కల్యాణచక్రవర్తి, పుతుంబాక సాయికృష్ణ, అంచే హరినాథ్‌బాబు, రోశయ్య, మొవ్వాచంద్రం, మనోహర్‌, తిరువీధుల బాపనయ్య, ప్రసంగి కొండలు, మన్నం అశోక్‌, గుత్తికొండ ధనుంజయరావు, వల్లూరు నరసింహరావు, వినోద్‌, జస్వంత్‌, పసుపులేటి రవియాదవ్‌, కావూరు చంద్రమోహన్‌, మాతంగి నరసింహం, రత్నకుమారి, రాజేశ్‌, వెంకటశ్రీధర్‌, యడ్లపాటి రాకేశ్‌, కడియాల అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. 


Read more