ఏడు కేజీల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2022-06-07T06:05:38+05:30 IST

గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు చేస్తున్న ఓ వ్యక్తిని స్పెషల్‌ బ్రాంచి ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

ఏడు కేజీల గంజాయి స్వాధీనం
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లు, వేయింగ్‌ మిషన్‌

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

యడ్లపాడు, జూన్‌ 6 : గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు చేస్తున్న ఓ వ్యక్తిని స్పెషల్‌ బ్రాంచి ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 7 కేజీల గంజాయి, వేయింగ్‌ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఒడిస్సాకు చెందిన ప్రతాపరెడ్డి కొన్ని సంవత్సరాల క్రితం ఉపాధికోసం యడ్లపాడు మండలానికి వలస వచ్చాడు. కొంతకాలంగా తిమ్మాపురం పరిధిలోని వసంత నూలు మిల్లులో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. అక్రమ సంపాదనకు అలవాటుపడిన ప్రతాపరెడ్డి స్వరాష్ట్రం నుంచి అక్రమ మార్గాల్లో గంజాయి తెప్పించుకుని సమీప పరిశ్రమలలోని కార్మికులకు విక్రయిస్తున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కొద్ది రోజులుగా ప్రతాపరెడ్డి కదలికలపై నిఘాపెట్టారు. ఈ క్రమంలో సోమవారం వసంత నూలు మిల్లు దగ్గర ప్రతాపరెడ్డి కర్రల సంచిలో గంజాయి పెట్టుకుని కార్మికులకు విక్రయిస్తున్నాడు. అప్పటికే ఆ ప్రాంతంలో మాటువేసిన స్పెషల్‌ బ్రాంచి పోలీసులు రెడ్‌ హేండెడ్‌గా ప్రతాపరెడ్డిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న గంజాయిని, వేయింగ్‌ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 


Updated Date - 2022-06-07T06:05:38+05:30 IST