పోలీస్‌స్టేషన్ అత్తగారిల్లు అయింది: లోకేష్

ABN , First Publish Date - 2022-09-08T20:59:10+05:30 IST

పోలీస్‌స్టేషన్ అత్తగారిల్లు అయింది: లోకేష్

పోలీస్‌స్టేషన్ అత్తగారిల్లు అయింది: లోకేష్

గుంటూరు: వైసీపీ ప్రభుత్వం అన్నం పెట్టదు.. పెట్టేవాళ్లను కొడుతుందని టీడీపీ నేత లోకేష్ మండిపడ్డారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటును అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎందుకు ఇంతగా భయపడుతోందని ప్రశ్నించారు. దాతల సహకారంతో క్యాంటీన్లను నడిపితే వారికేంటి? అని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సంగం డెయిరీ రైతులకు మేలు చేస్తుంటే అడ్డుకునే కుట్రలో ఉన్నారని ఆరోపించారు. తనపై 15 కేసులు పెట్టారు, 7 సార్లు పీఎస్‌కు తీసుకెళ్లారని, పోలీస్‌స్టేషన్ తనకు అత్తగారిల్లు అయిందని మండిపడ్డారు. 

Read more