-
-
Home » Andhra Pradesh » Guntur » AP News Cine hero Mohan Babu and his sons get relief in the High Court mvs-MRGS-AndhraPradesh
-
AP News: సిని హీరో మోహన్ బాబు, ఆయన కుమారులకు హైకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2022-09-19T23:43:25+05:30 IST
Amaravathi: సిని హీరో మోహన్ బాబు (Mohan Babu), ఆయన కుమారులు మంచు మనోజ్, విష్ణులకు హైకోర్టు (High court)లో ఊరట లభించింది. 2019 ఎన్నికల సమయంలో తిరుపతి(Tirupati)లో నిర్వహించిన ధర్నాకు సంబధించి వారిపై కేసు నమోదైంది. ఈ

Amaravathi: సిని హీరో మోహన్ బాబు (Mohan Babu), ఆయన కుమారులు మంచు మనోజ్, విష్ణులకు హైకోర్టు (High court)లో ఊరట లభించింది. 2019 ఎన్నికల సమయంలో తిరుపతి(Tirupati)లో నిర్వహించిన ధర్నాకు సంబధించి వారిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి తిరుపతి కోర్టులో విచారణ జరుగుతోంది. కాగా ఈ విచారణను నిలిపివేయాలని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణను ఎనిమిది వారాలపాటు నిలిపివేస్తూ..కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
చంద్రబాబు హయంలో ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్ చెల్లించలేదని 2019 మార్చి 22న మోహన్ బాబుతో పాటు ఆయన కుమారులు తిరుపతి - మదనపల్లి జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఆ సమయంలో సార్వత్రిక కోడ్ అమల్లో ఉన్నందున ముగ్గురిపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదుచేశారు.