AP Cabinet: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ట్యాబ్‌ల పంపిణీ ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2022-12-13T14:16:51+05:30 IST

సీఎం జగన్(Cm jagan) అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జగన్ జన్మదినాన్ని

AP Cabinet: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ట్యాబ్‌ల పంపిణీ ఎప్పుడంటే..
ట్యాబ్‌ల పంపిణీ ఎప్పుడంటే..

అమరావతి: సీఎం జగన్(Cm jagan) అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 21న 8 తరగతి విద్యార్థులకు 5 లక్షల ట్యాబ్‌ల పంపిణీకి మంత్రివర్గం(AP Cabinet) ఆమోదం తెలిపింది. అలాగే రూ.2,500 ఉన్న పింఛన్‌ను రూ.2,750కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1నుంచి పెరిగిన కొత్త పెన్షన్ అమలు కానుందని తెలిపింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఏపీ పంపెడ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీ‌‌‌కి కూడా ఆమోదం లభించింది. భూముల రీ సర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణకు.. బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 1301 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రెండు మున్సిపాలిటీలు 101 గ్రామాలతో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ.. 8 మున్సిపాలిటీలు, 28 మండలాల్లో 349 గ్రామాలతో 7281 చదరపు కిలమీటర్ల పరిధితో పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే కొత్తగా ఏర్పాటు కానున్న ఏపీ జ్యుడిషియల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. వీటితో పాటు కొత్తగా ఏర్పాటైన కొన్ని జిల్లాల్లో వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపునకు కూడా ఆమోదం తెలిపింది. హెల్త్ హబ్స్ ఏర్పాటుకు కొత్త విధానానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం జిందాల్ స్టీల్‌ను భాగస్వామిగా ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టీటీడీలో కొన్ని శాఖలకు ప్రచారం కోసం చీఫ్ పీర్వో పోస్టు భర్తీకి జగన్ కేబినెట్ ఆమోదం తెలిపింది.

Updated Date - 2022-12-13T16:05:02+05:30 IST