Mangalagiri: ఎట్టకేలకు మంగళగిరిలో అన్న క్యాంటీన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-06-11T05:47:47+05:30 IST

నగరంలో ఆర్టీసీ బస్టాండ్‌ వెలుపల ఎన్టీఆర్‌-ఎమ్మెస్సెస్‌ విగ్రహాల వద్ద తాత్కాలిక అన్న క్యాంటీన్‌ ఎట్టకేలకు శుక్రవారం ప్రారంభమైంది.

Mangalagiri: ఎట్టకేలకు మంగళగిరిలో అన్న క్యాంటీన్‌ ప్రారంభం
అన్నాక్యాంటీన్‌ వద్ద భోజనాలు చేస్తున్న బాటసారులు

ప్రారంభించిన మాజీమంత్రి నక్కా ఆనందబాబు

మళ్లీ అడ్డుపడితే లక్ష మందితో ఛలో మంగళగిరి

టీడీపీ నేతల హెచ్చరిక


మంగళగిరి: నగరంలో ఆర్టీసీ బస్టాండ్‌ వెలుపల ఎన్టీఆర్‌-ఎమ్మెస్సెస్‌ విగ్రహాల వద్ద తాత్కాలిక అన్న క్యాంటీన్‌ ఎట్టకేలకు శుక్రవారం ప్రారంభమైంది. శుక్రవారం టీడీప శ్రేణులు అదే ప్రాంగణంలో షామియానా వేసి అన్నదానం జరిపించారు. తాత్కాలిక నిర్మాణాలు చేపట్టవచ్చునన్న అనుమానంతో ఆ ప్రాంతంలో పోలీసు బలగాలను పెద్దఎత్తున మోహరింపజేశారు. మాజీమంత్రి నక్కా ఆనందబాబు ముఖ్యఅతిథిగా హాజరై భోజనాల వడ్డింపు కార్యక్రమాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, నగరపాలకసంస్థ, పోలీసు అధికారులు ఎన్ని అడ్డంకులను కల్పించినా తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పట్టుదలతో అన్న క్యాంటీన్‌  ప్రారంభించామని చెప్పారు. పేదలకు అన్నం పెడతామంటే ఈ ప్రభుత్వానికి ఎందుకంత కడుపుమంటో తమకు అర్ధం కావడం లలేదన్నారు. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ మరోమారు అన్న క్యాంటిన్‌కు  అడ్డు తగిలితే లక్షమందితో ఛలో మంగళగిరి చేపడతామని హెచ్చరించారు.  ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి, నియోజకవర్గ  నాయకులు తోట పార్ధసారధి, దామర్ల రాజు, ఆకుల జయసత్య, ఆరుద్ర భూలక్ష్మి, షేక్‌ రియాజ్‌, షేక్‌ సుభానీ, యలమంచిలి పద్మజ, మహమ్మద్‌ ఇబ్రహీం, వెలగపాటి విలియం, ముశం రవికుమార్‌, గోవాడ దుర్గారావు, వి.మైనర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-11T05:47:47+05:30 IST