అచ్చ గిరిజన కవితా సంపుటి ‘దుర్ల’

ABN , First Publish Date - 2022-07-18T05:59:47+05:30 IST

అచ్చ గిరిజన కవితా సంపుటి ‘దుర్ల’ అని ఎమ్మెల్సీ డొక్కామాణిక్యవరప్రసాదు కొనియాడారు. బ్రాడీపేటలోని ఓ హోటల్లో ఆదివారం బీఆర్‌ అంబేద్కర్‌- జాషువా- పెరియార్‌-పూలే లిట రేచర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దుర్ల కవితా సంపుటి ఆవిష్కరణ నిర్వహిం చారు.

అచ్చ గిరిజన కవితా సంపుటి ‘దుర్ల’
దుర్ల కవితా సంపుటిని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాదు, విరసం, అరసం నాయకులు

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాదు

గుంటూరు(తూర్పు), జూలై 17: అచ్చ గిరిజన కవితా సంపుటి ‘దుర్ల’ అని ఎమ్మెల్సీ డొక్కామాణిక్యవరప్రసాదు కొనియాడారు. బ్రాడీపేటలోని ఓ హోటల్లో ఆదివారం బీఆర్‌ అంబేద్కర్‌- జాషువా- పెరియార్‌-పూలే లిట రేచర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దుర్ల కవితా సంపుటి ఆవిష్కరణ నిర్వహిం చారు. కవి బీ విల్సన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి బీ శ్యాంబాబు మోడరేటర్‌గా వ్యవహరించారు. కవితా సంపుటిని విరసం, అరసం నాయ కులు సీఎస్‌ఆర్‌ ప్రసాదు, పెనుగొండ లక్ష్మీనారాయణ, సామాజిక న్యాయ వాది పి.ప్రసాదు, ఆంధ్రా మేధావుల ఫోరం కో కన్వీనర్‌ టీ నరసింహారావు తో కలసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం డొక్కా మాట్లాడుతూ దుర్ల కవిత్వాన్ని రాసిన జగదీష్‌ గిరిజనుడు కావడం కవిత్వానికి మరింత వన్నె తెచ్చింద ని పేర్కొన్నారు. పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దుర్ల వంటి కవిత్వం అందించిన జగదీష్‌ తన శిష్యుడు కావడం సంతోషంగా ఉందన్నారు. సీఎస్‌ఆర్‌ ప్రసాదు మాట్లాడుతూ సమాజ విస్మరణకు గురవు తున్న గిరిజనులు పోరాటాలతోనే తమ ఉనికిని చాటుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు సీనియర్‌ న్యాయవాది సంజీవరెడ్డి, మనసు ఫౌండేషన్‌ సభ్యులు పారా ఆశోక్‌, మార్పులు కవులు సుభాని, మన్తాన్‌వలీ, ప్రజా సంఘాల నాయకులు నీలాంభరం, కాపు శ్రీనివాస్‌, జొన్నలగడ్డ శ్రీకాంత్‌, న్యాయవాది ఫణీంద్ర, చల్లా మధుసూదనరావు, బండారు సురేష్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-18T05:59:47+05:30 IST