రాష్ట్ర ఆదాయ వనరు అమరావతి

ABN , First Publish Date - 2022-08-10T06:03:44+05:30 IST

రాష్ట్ర ఆదాయ వనరు అమరావతిని నాశనం చేయడానికి వైసీపీ సర్కారు ప్రయత్నిస్తోందని భూములు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు.

రాష్ట్ర ఆదాయ వనరు అమరావతి
తుళ్లూరు శిబిరంలో బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న మహిళలు

దానిని నాశనం చేయాలనుకుంటున్నారు..

కోర్టు తీర్పును అనుసరించి అభివృద్ధి చేయాలి

966వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు  

తుళ్లూరు, ఆగస్టు 9: రాష్ట్ర ఆదాయ వనరు అమరావతిని నాశనం చేయడానికి వైసీపీ సర్కారు ప్రయత్నిస్తోందని భూములు త్యాగం చేసిన  రైతులు పేర్కొన్నారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు మంగళవారం 966వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ, అమరాతిని అభివృద్ధి చేస్తామని చెప్పిన  సీఎం జగన్‌రెడ్డి అధికారం చేపట్టాక మూడు రాజధానులంటూ మాట తప్పారన్నారు. భూములిచ్చిన రైతులను నడిరోడ్డు మీద కూర్చోపెట్టడం తగదన్నారు. తామిచ్చిన భూముల్లో రాష్ట్ర  సచివాలయం కట్టారని, గత ఐదున్నరేళ్లుగా అమరావతి రాజధాని నుంచి పరిపాలన సాగుతోందని అన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. దీపాలు వెలిగించి బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి.  


Read more