-
-
Home » Andhra Pradesh » Guntur » ake action against Lonapp admins Vanita mvs-MRGS-AndhraPradesh
-
AP News: లోన్‌యాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోండి: వనిత
ABN , First Publish Date - 2022-09-09T22:11:50+05:30 IST
Amaravathi: ఇటీవల పెరిగిపోతున్న లోన్‌యాప్ (Loan App) నిర్వాహకులు, సిబ్బంది వేధింపులపై మంత్రి వనిత (Vanitha) సమీక్ష సమావేశం నిర్వహించారు. లోన్‌యాప్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులకు ఆదేశించారు. కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆత్మహత్య (Suicide) కేసులో నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిం

Amaravathi: ఇటీవల పెరిగిపోతున్న లోన్‌యాప్ (Loan App) నిర్వాహకులు, సిబ్బంది వేధింపులపై మంత్రి వనిత (Vanitha) సమీక్ష సమావేశం నిర్వహించారు. లోన్‌యాప్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులకు ఆదేశించారు. కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆత్మహత్య (Suicide) కేసులో నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లబ్బర్తికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి లోన్ యాప్‌లో రుణం అప్పుగా తీసుకున్నారు. అప్పు సరిగా చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకుల నుంచి బెదిరింపులు, వేధింపులు ఎదురయ్యాయి. డబ్బు చెల్లించకపోతే రమ్యలక్ష్మి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. కొన్ని రోజులకే రమ్యలక్ష్మి ఫోటోను మార్ఫింగ్ చేసి మళ్లీ బెదిరించారు. రెండు రోజుల వ్యవధిలో పూర్తి రుణాన్ని వడ్డీతో సహా చెల్లించకపోతే ఈ ఫోటోతో పాటూ అసభ్యకరంగా వీడియోను తయారు చేసి పంపుతామని బెదిరించడంతో భార్యాభర్తలు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు.