రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి

ABN , First Publish Date - 2022-02-20T05:16:27+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ద్విచక్ర వాహనాలపై ఒకే మార్గంలో ఎదురెదురుగా వస్తున్న యువకులు పరస్పరం ఢీకొని మృతిచెందిన ఘటన శుక్రవారం రాత్రి కూచిపూడి లాకుల సమీపంలో చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి
కంచర్ల ప్రవీణ్‌ ఆలపాడు, మింగు లవకుమార్‌ మండూరు (ఫైల్‌ఫొటో)

చుండూరు, ఫిబ్రవరి 19 : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ద్విచక్ర వాహనాలపై ఒకే మార్గంలో ఎదురెదురుగా వస్తున్న యువకులు పరస్పరం ఢీకొని మృతిచెందిన ఘటన శుక్రవారం రాత్రి కూచిపూడి లాకుల సమీపంలో చోటుచేసుకుంది. ఆలపాడుకు చెందిన కంచర్ల ప్రవీణ్‌కుమార్‌ (36) తెనాలిలో ఓ బైక్‌ షోరూమ్‌లో పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని రాత్రికి 10 గంటల సమయం ఆలపాడు బయలుదేరాడు. అదే సమయంలో మండూరుకు చెందిన మింగు లవ్‌కుమార్‌ (30) కూచిపూడి లాకుల వద్ద ఉన్న తన తండ్రిని ఇంటికి తీసుకు రావడం కోసం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుండి తెనాలి వైపు బయలుదేరాడు. వీరి ఇరువురి ద్వి చక్రవాహనాలు కూచిపూడి లాకుల వద్ద పరస్పరం ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఇరువురిని తెనాలిలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు లవ్‌కుమార్‌కి తొమ్మిది నెలల క్రితమే వివాహమైంది. కంచర్ల ప్రవీణ్‌కుమార్‌కి ఇద్దరు పిల్లలు. అమృతలూరు ఎస్‌ఐ వాసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పరామర్శ

ప్రమాద సంఘటన తెలుసుకున్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆలపాడు, మండూరు గ్రామాలు వెళ్లి యువకులు మృతదేహాల వద్ద పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వీరివెంట వీఎస్‌కే ప్రసాద్‌, ఎల్లారెడ్డి తదితరులు ఉన్నారు. అలాగే జనసేన జిల్లా కార్యదర్శి బోడియ్య, కో-ఆర్డినేటర్‌ రవికృష్ణ నివాళులర్పించారు. 


Updated Date - 2022-02-20T05:16:27+05:30 IST