-
-
Home » Andhra Pradesh » Guntur andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
Guntur: ఎన్టీఆర్ భవన్‌కు కోడెల శివరాం... హౌస్ అరెస్ట్
ABN , First Publish Date - 2022-02-19T15:05:09+05:30 IST
టీడీపీ నేత కోడెల శివరాం పాదయాత్ర నేపథ్యంలో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పాదయాత్రకు పోలీసులు అడ్డుంకులు సృష్టిస్తున్నారు.

గుంటూరు: టీడీపీ నేత కోడెల శివరాం పాదయాత్ర నేపథ్యంలో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పాదయాత్రకు పోలీసులు అడ్డుంకులు సృష్టిస్తున్నారు. మరోవైపు కాసేపటి క్రితమే సత్తెనపల్లిలోని ఎన్టీఆర్ భవన్‌కు కోడెల చేరుకున్నారు. పార్టీ ఆఫీస్‌లో టీడీపీ జెండా ఎగరవేసిన శివరాం... ఎన్టీఆర్, కోడెల, సుబ్బారావు విగ్రహాలకు పులమాలు వేసి నివాళులర్పించారు. కాగా ఎన్టీఆర్‌భవన్‌ను పోలీసులు చుట్టుముట్టారు. పాదయాత్రకు బయలుదేరుతున్న కోడెలను పోలీసులు అడ్డుకుని పార్టీ ఆఫీస్‌లోనే హౌస్ అరెస్ట్ చేశారు.