-
-
Home » Andhra Pradesh » Gugudu Kullaiswamy Temple painted politica colours vsp-MRGS-AndhraPradesh
-
Gugudu Kullaiswamy Temple: ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే ఏం చేశారంటే..!
ABN , First Publish Date - 2022-08-01T00:54:04+05:30 IST
జిల్లాలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే గూగూడు కుళ్ళాయి స్వామి క్షేత్రానికి (Gugudu Kullaiswamy Temple) రాజకీయ ..

అనంతపురం (Ananthapuram): జిల్లాలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే గూగూడు కుళ్ళాయి స్వామి క్షేత్రానికి (Gugudu Kullaiswamy Temple) రాజకీయ రంగులు అద్దారు. కుళ్ళాయి స్వామి ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతి (Mla Jonnala Gadda Padmavathi) రంగులను మార్పించారు. పోలీస్ బందోబస్తు నడుమ తన అనుచరుల ద్వారా ఆలయంలో తెల్ల రంగు వేయించారు. అక్కడక్కడ బంగారం రంగు వేయించారు.
ఇప్పటివరకూ అన్ని కులమతాల ఐక్యతకు గుర్తుగా రంగులు ఉండేవని ఇప్పుడు తెల్లరంగులు వేయడం ఏంటని.. ఎమ్మెల్యే తీరును భక్తులు తప్పు బడుతున్నారు. ఎమ్మెల్యే తీరుపై సోషల్ మీడియా (Social Media) వేదికగా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. నార్పల మండలంలో ప్రస్తుతం స్వామి వారి ఆలయానికి వేసిన రంగులపై చర్చ నడుస్తోంది.
కుళ్ళాయి స్వామి బ్రహ్మోత్సం కోసం దేవాదాయ శాఖ రూ.2.5 లక్షలు వెచ్చించి ఆలయానికి రంగులు వేయించారు. ఆ తర్వాత రెండు రోజులకే ఎమ్మెల్యే రంగంలోకి తెల్లరంగులు వేయించారు. దీంతో దేవాదాయ శాఖ సొమ్ము వృదా అయింది. ఈ విషయంపై దేవాదాయ శాఖ అధికారి శోభను వివరణ కోరగా.. ఎమ్మెల్యే చెప్పారని తమకు సమాచారం ఇచ్చి రంగులను మార్పించారన్నారు. ఎమ్మెల్యే సొంత నిధులతో రంగులు వేయించారని ఆమె సమాధానం ఇచ్చారు. అంతకుమించి తమనేమి అడగవద్దని ఫోన్ కట్ చేశారు.