అసెంబ్లీ, మండలిలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

ABN , First Publish Date - 2022-08-16T10:17:42+05:30 IST

76వ స్వాతంత్య్ర వేడుకలు అమరావతిలోని రాష్ట్ర శాసనమండలి, శాసనసభ ప్రాంగణాల్లో సోమవారం ఘనంగా జరిగాయి.

అసెంబ్లీ, మండలిలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

జెండా ఎగురవేసిన తమ్మినేని, మోషేన్‌రాజు

అమరావతి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): 76వ స్వాతంత్య్ర వేడుకలు అమరావతిలోని రాష్ట్ర శాసనమండలి, శాసనసభ ప్రాంగణాల్లో సోమవారం ఘనంగా జరిగాయి. శాసనమండలి భవనంపై కొయ్యే మోషేన్‌రాజు, శాసనసభ భవనంపై స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ వేర్వేరుగా జాతీయ జెండాలను ఎగుర వేశారు. ఎస్పీఎఫ్‌ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తర్వాత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రంలో ఉన్న కొద్దిపాటి వనరులను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలోని ప్రతి పేదవానికీ స్వాతంత్య్ర ఫలాలు అందే విధంగా అన్ని వర్గాల అభ్యన్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మోషేన్‌రాజు అన్నారు. సచివాలయంలో సీఎస్‌ సమీర్‌శర్మ జెండాను ఎగురవేశారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read more