Golingeswara swamy temple: శివలింగానికి ఊహించని అపచారం..

ABN , First Publish Date - 2022-09-26T00:19:22+05:30 IST

బిక్కవోలులోని శ్రీగోలింగేశ్వరస్వామి ఆలయంలో ఊహించని అపచారం జరిగింది. ఆలయ పార్కింగ్ ప్రదేశంలో వై.ఎస్.ఆర్ చేయూత పంపిణీ నిర్వహించారు. స్థానిక వైసీపీ నేతలు...

Golingeswara swamy temple: శివలింగానికి ఊహించని అపచారం..

తూర్పుగోదావరి: బిక్కవోలులోని శ్రీగోలింగేశ్వరస్వామి ఆలయంలో ఊహించని అపచారం జరిగింది. ఆలయ పార్కింగ్ ప్రదేశంలో వై.ఎస్.ఆర్ చేయూత పంపిణీ నిర్వహించారు. స్థానిక వైసీపీ నేతలు ఈ కార్యక్రమం కోసం షామియానాను ఏర్పాటు చేశారు. షామియానా తాళ్లను ఆలయంలోని శివలింగానికి కట్టారు. అయితే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వైసీపీ నేతలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే శివుడిని కూడా వైసీపీ నేతలు అవమానించారని మండిపడుతున్నారు. షామియా తాళ్లు శివలింగానికి కట్టమేంటని ప్రశ్నిస్తున్నారు. చేసిన పాపానికి తగిన శాస్తి జరుగుతుందని శాపాలు పెడుతున్నారు. 

Updated Date - 2022-09-26T00:19:22+05:30 IST