పోలవరాన్ని పరిశీలించిన గోదావరి రివర్‌ బోర్డు

ABN , First Publish Date - 2022-03-17T02:03:39+05:30 IST

గోదావరి జలాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోదావరి రివర్‌ బోర్డు బృందం బుధవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించింది.

పోలవరాన్ని పరిశీలించిన గోదావరి రివర్‌ బోర్డు

పోలవరం: గోదావరి జలాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోదావరి రివర్‌ బోర్డు బృందం బుధవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించింది. బోర్డు మెంబర్‌ సెక్రటరీ కుడ్యా ఆధ్వర్యంలో ఈ బృందం ప్రాజెక్టులో స్పిల్‌వే, కాపర్‌డ్యాం, జంట గుహలు, హెడ్‌ రెగ్యులేటర్‌, డెలివరీ చానల్‌ సమీపంలో ఉన్న దిగువ రెగ్యులేటర్లను పరిశీలించారు. ఈ బృందానికి ఏపీ హైడ్రాలజీ చీఫ్‌ ఇంజనీర్‌ రత్నకుమార్‌, తెలంగాణ హైడ్రాలజీ చీఫ్‌ ఇంజనీర్‌ కాశీ విశ్వనాథ్‌ సంబంధిత వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్‌ ఇంజనీర్‌ రత్నకుమార్‌ మాట్లాడుతూ  ఏపీ, తెలంగాణ ఇప్పటి వరకూ 1340 టీఎంసీల నీటి నిల్వలను కలిగి ఉన్నాయని, ఎగువ నుంచి వచ్చే ఇన్‌ఫ్లో దిగువ రాష్ట్రాల నీటి వినియోగం తదితర అంశాలపై బృందం పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2022-03-17T02:03:39+05:30 IST