2004 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగ, ఉపాధ్యాయుల వివరాలివ్వండి

ABN , First Publish Date - 2022-08-17T10:00:19+05:30 IST

రాష్ట్రంలో సీపీఎస్‌ అమల్లోకి రాక ముందు నియామక ప్రక్రియ జరిగి 2004 సెప్టెంబరు ఒకటో తేదీ తర్వాత విధుల్లోకి చేరిన ఉద్యోగ, ఉపాధ్యాయుల వివరాలను ఇవ్వాలంటూ రాష్ట్ర సచివాలయంలోని అన్ని శాఖల అధికారులకు ఆర్థికశాఖ యూవో నోట్‌ ఇచ్చింది.

2004 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగ, ఉపాధ్యాయుల వివరాలివ్వండి

అమరావతి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సీపీఎస్‌ అమల్లోకి రాక ముందు నియామక ప్రక్రియ జరిగి 2004 సెప్టెంబరు ఒకటో తేదీ తర్వాత విధుల్లోకి చేరిన ఉద్యోగ, ఉపాధ్యాయుల వివరాలను ఇవ్వాలంటూ రాష్ట్ర సచివాలయంలోని అన్ని శాఖల అధికారులకు ఆర్థికశాఖ యూవో నోట్‌ ఇచ్చింది.  కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ ప్రకారం పాత పెన్షన్‌ సౌకర్యం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని శాఖల నుంచి సమాచారం కోరింది. ఈ విధంగా పాత పెన్షన్‌కు అర్హత కలిగిన ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఖ్య 6510గా పాఠశాల విద్యాశాఖ నిర్ధారించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే డీఎస్సీ 2003లో ఉపాధ్యాయులు, అర్హత కలిగిన ఇతర ఉద్యోగుల సంఖ్య 6510గా పేర్కొంది. ప్రభుత్వం పాలసీ డెసిషన్‌ తీసుకునేందుకు అన్ని శాఖల అధికారులు ఆయా శాఖల్లో పోస్టుల వారీగా, ఒక ఫార్మాట్‌లో ఉద్యోగుల వివరాలివ్వాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి యూవో నోట్‌లో అధికారులను కోరారు.

Read more