Nellore: విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే..!

ABN , First Publish Date - 2022-09-26T22:51:53+05:30 IST

మహిళలు, విద్యార్థులపై అరాచకాలను నియంత్రించేందుకు ప్రభుత్వాలు కఠిన శిక్షలు అమలు చేస్తున్నా కొందరు యువకులు మాత్రం వాటిని అవలీలగా ఖాతరు చేస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ ...

Nellore: విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే..!

నెల్లూరు (Nellore): మహిళలు, విద్యార్థులపై అరాచకాలను నియంత్రించేందుకు ప్రభుత్వాలు కఠిన శిక్షలు అమలు చేస్తున్నా కొందరు యువకులు మాత్రం వాటిని అవలీలగా ఖాతరు చేస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ చెలరేగిపోతున్నారు. లైంగిక కోరికలు తీర్చమంటూ వేధిస్తున్నారు. వీటింటన్నినీ తప్పించుకుని పోలీసు స్టేషన్ వెళ్లినా కొన్నిచోట్ల న్యాయం జరగడంలేదు.. బాధితుల ఫిర్యాదును అసలు పట్టించుకోవడంలేదు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘటన నెల్లూరు పట్టణంలో జరిగింది. 


నెల్లూరు 4వ మైలు ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని టెన్త్ చదువుతోంది. ప్రతిరోజు స్కూలుకు వెళ్లి వస్తోంది. అయితే విద్యార్థినిని ముగ్గురు యువకులు వేధించారు. లైంగిక కోరిక తీర్చమంటూ వెంటపడ్డారు. విద్యార్థిని వినకపోవడంతో ఆమె స్నానం చేస్తుండగా వీడియోలు తీశారు. తమ కోరిక తీర్చాలని ఒత్తిడి చేశారు. విద్యార్థిని వినకపోవడంతో వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరించారు. యువకుల వేధింపులు తాళ్లలేక విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో యువకులు విష్ణు, రాజు, వినోద్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


అయితే పోలీసులు తమ ఫిర్యాదును పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేయాలని కోరినా పట్టించుకోలేదని చెబుతున్నారు. కనీసం విచారణ అయినా జరపాలని విజ్ఞప్తి కూడా తోసిపుచ్చారు. దీంతో పోలీసుల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2022-09-26T22:51:53+05:30 IST