యార్లగడ్డ, దుట్టాకు Vallabhaneni Vamshi ఘాటైన కౌంటర్

ABN , First Publish Date - 2022-06-11T15:22:46+05:30 IST

గన్నవరం వైసీపీలో రోజు రోజుకీ వివాదం ముదురుతోంది.

యార్లగడ్డ, దుట్టాకు Vallabhaneni Vamshi ఘాటైన కౌంటర్

విజయవాడ: గన్నవరం వైసీపీ(YCP)లో రోజు రోజుకీ వివాదం ముదురుతోంది. నిన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్(Vallabhaneni Vamsi Mohan) టార్గెట్‌గా యార్లగడ్డ వెంకట్రావు(Yarlagadda Venkatrao), దుట్టా రామచంద్రరావు(Dutta Ramachandra Rao) వ్యాఖ్యలు చేశారు. దీంతో యార్లగడ్డ వ్యాఖ్యలకు వల్లభనేని వంశీ ఘాటైన  కౌంటర్‌ ఇచ్చారు. జస్టిస్ చౌదరిలుగా రోడ్డుపై వెళ్లే ప్రతివాడు కామెంట్స్ చేస్తుంటారని మండిపడ్డారు. గన్నవరం నియోజకవర్గం ప్రజలు తనను ఆశీర్వదించారని తెలిపారు. వాళ్లకి ఏమైనా ఇబ్బంది ఉంటే అధిష్టానానికి చెప్పుకోవాలని అన్నారు. సీఎం జగన్ తనను పని చేయమని చెప్పారన్నారు. యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావుకి బాధ ఉంటే సీఎంని కలవాలని...  ఇలాంటి మాటలు మాట్లాడం సరికాదని ఆయన అన్నారు.


ఈ ప్రాంత ప్రజలకు ఏం చేయాలో తనకు తెలుసన్నారు. ‘‘పనిచేయకుండా హడావుడి చేసే వాళ్లను చాలా మందిని చూశాను. నేను హీరోనా.. విలన్‌నా గన్నవరం ప్రజలను అడిగితే చెబుతారు. నేను విలన్ అని అన్నవారు.. మహేష్ బాబు, ప్రభాస్‌లా?’’ అంటూ యెద్దేవా చేశారు.  మట్టి గురించి అల్లరు చేసి పేదవాడికి మట్టి అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ట్రాక్టర్లు మట్టిని 4 కిలోమీటర్లు తోలితే కనీసం డీజిల్ ఖర్చులు రావన్నారు. ఆరోపణలు చేసేవాళ్లంతా చంద్రబాబు స్కూల్ చెందిన వాళ్లే అంటూ ఎమ్మెల్యే వంశీ వ్యాఖ్యానించారు. 

Read more