నల్లబెలూన్ల ఎగురవేతపై Gannavaram DSP పొంతన లేని సమాధానం

ABN , First Publish Date - 2022-07-04T20:21:13+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో నల్లబెలూన్లు ఎగురవేయడంపై గన్నవరం డీఎస్పీ విజయపాల్ పొంతన లేని సమాధానం చెప్పారు.

నల్లబెలూన్ల ఎగురవేతపై Gannavaram DSP పొంతన లేని సమాధానం

విజయవాడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) పర్యటనలో నల్లబెలూన్లు ఎగురవేయడంపై గన్నవరం డీఎస్పీ (Gannavaram DSP) విజయపాల్ పొంతన లేని సమాధానం చెప్పారు. విమానాశ్రయానికి  నాలుగు కిలోమీటర్ల దూరంలో కాంగ్రెస్ (Congress) శ్రేణులు మూడు బెలూన్లను ఎగురవేశారన్నారు. మూడు బెలూన్లు ఎగురవేస్తే భద్రతా లోపం అంటారా? అని ప్రశ్నించారు. ఎక్కడో విజయవాడలో బెలూన్లు ఎగురవేశారని అన్నారు. కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ (Sunkara padma sri)తో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేశామని... కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ (Rajiv ratan) కోసం వెతుకుతున్నామని డీఎస్పీ విజయపాల్ అన్నారు. కాగా... గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ బిల్డింగ్ మీద నుంచి కాంగ్రెస్ నేతలు బెలూన్లు వదిలారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ నేతృత్వంలో కొందరు యువకులు నల్ల బెలూన్లు వదిలారు. అంతకుముందు గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మ శ్రీ, ఎమ్మార్పీఎస్ నేతలు.. ఎయిర్ పోర్టు సమీపంలో నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే కాంగ్రెస్‌ నిరసనలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు మండిపడ్డారు. హెలికాప్టర్ సమీపంలో బెలూన్లు ఎగురవేయడం వెనక కుట్ర ఉందని, ప్రధాని మోదీపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ ఘనటపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 

Read more