హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై గడ్కరీ సమీక్ష

ABN , First Publish Date - 2022-03-16T09:21:22+05:30 IST

హైదరాబాద్‌ -విజయవాడ రహదారి విస్తరణ స్థితిపై మంగళవారం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సమీక్షించారు. కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్‌ ఆ

హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై గడ్కరీ సమీక్ష

న్యూఢిల్లీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ -విజయవాడ రహదారి విస్తరణ స్థితిపై మంగళవారం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సమీక్షించారు. కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్‌ ఆర్బిట్రేషన్‌కు వెళ్లిన నేపథ్యంలో రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ పలుమార్లు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వినతిపత్రాలు సమర్పించారు. దీంతో గడ్కరీ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో వెంకట్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు. సమావేశానంతరం వెంకట్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... నష్టం వచ్చిందని చెబుతూ కాంట్రాక్టు సంస్థ  ఆరు లైన్ల రోడ్డు నిర్మాణం చేయడం లేదన్నారు. దీంతో ఈ రహదారిపై ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ విషయమై జీఎంఆర్‌ సంస్థను కేంద్ర మంత్రి గడ్కరీ హెచ్చరించారని వెల్లడించారు. 

Updated Date - 2022-03-16T09:21:22+05:30 IST