AP News: చంద్రబాబుకు ఓటేస్తా.. కంగుతిన్న ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-07-26T01:35:45+05:30 IST

గడపగడపకు మన ప్రభుత్వం’ (Gadapa Gadapaku Mana Prabuthavam) కార్యక్రమంలో భాగంగా ప్రజల దగ్గరకు వెళుతున్న వైసీపీ (YCP) నాయకులకు

AP News: చంద్రబాబుకు ఓటేస్తా.. కంగుతిన్న ఎమ్మెల్యే

ఆదోని: ‘గడపగడపకు మన ప్రభుత్వం’ (Gadapa Gadapaku Mana Prabuthavam) కార్యక్రమంలో భాగంగా  ప్రజల దగ్గరకు వెళుతున్న వైసీపీ (YCP) నాయకులకు వివిధ రూపాల్లో షాకులు తగులుతున్నాయి. తాజాగా సోమవారం కర్నూలు జిల్లా (Kurnool District) ఆదోని పట్టణంలోని అంబేద్కర్‌ నగర్‌లో ‘గడప గడపకు..’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఈరమ్మ అనే  వృద్ధురాలితో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ...‘ప్రతి నెల మీకు పెన్షన్‌.. మీ ఇంట్లో అమ్మఒడి పథకాలు అందిస్తున్నాం. అన్ని పథకాలూ అందిస్తున్నాం కదా. నీ  ఓటు ఎవరికి వేస్తావు?’ అని ప్రశ్నించారు. దీంతో ఆ వృద్ధురాలు ఏమాత్రం తడబడకుండా ‘చంద్రబాబు (Chandrababu)కు ఓటేస్తా’నని సమాధానమిచ్చింది. ఆ సమాధానం విని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి కంగుతున్నారు. వృద్ధురాలి మాటతో అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ‘చంద్రబాబు భ్రమ నుంచి మీరు ఇంకా బయటకు రాలేదు’ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.  

Updated Date - 2022-07-26T01:35:45+05:30 IST