సాగుకు లక్ష కోట్ల ఖర్చు నిరూపిస్తారా: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2022-06-11T07:59:15+05:30 IST

సాగుకు లక్ష కోట్ల ఖర్చు నిరూపిస్తారా: సోమిరెడ్డి

సాగుకు లక్ష కోట్ల ఖర్చు నిరూపిస్తారా: సోమిరెడ్డి

అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ శాఖకు మూడేళ్లలో రూ.లక్షా 10వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పిన వ్యవసాయ మంత్రి నిరూపిస్తే.. వంగి దండం పెడతానని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సవాల్‌ చేశారు. వ్యవసాయ రంగంలో దేనికి ఎంతెంత ఖర్చు పెట్టారో తెలిపితే.. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఓవిధంగా వ్యవసాయ శాఖ మూతపడిందని విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు రూ.43వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు నిరూపించాలని, ఇందులో బ్రోకర్లకు ఎంత పోయిందో చెప్పాలన్నారు. ఉచిత విద్యుత్‌కు ఇచ్చింది రూ.13వేల కోట్లు అనడం పచ్చి అబద్ధమని విమర్శించారు.

Read more