ఓట్లు చీలకపోతే వైసీపీకి డిపాజిట్లూ గల్లంతే!

ABN , First Publish Date - 2022-03-16T08:27:49+05:30 IST

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని మాజీ మంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించారు.

ఓట్లు చీలకపోతే వైసీపీకి డిపాజిట్లూ గల్లంతే!

జనం.. జగన్‌ ఓటమిని కోరుతున్నారు: చినరాజప్ప


అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని మాజీ మంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వబోమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. ‘పవన్‌ ఏం మాట్లాడినా వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. ఆయన మాట్లాడిన ప్రతి మాట వారి గుండెల్లో శూలంలా గుచ్చుకుంది. అందుకే ఆయనపై విరుచుకు పడుతున్నారు’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.  

Read more