Flood victims: సీఎస్‌కు చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2022-07-31T23:08:31+05:30 IST

ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మ (Sameer Sharma)కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ (letter) రాశారు. వరద బాధితులు

Flood victims: సీఎస్‌కు చంద్రబాబు లేఖ

అమరావతి: ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మ (Sameer Sharma)కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ (letter) రాశారు. వరద బాధితులు (Flood victims), పోలవరం నిర్వాసితుల సమస్యలపై చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. బాధిత కుటుంబాలకు రూ.10వేల సాయం అందించాలని డిమాండ్ చేశారు. పోలవరం (Polavaram) నిర్వాసితులకు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలన్నారు. గోదావరి వరదల వల్ల వేల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని, బాధితులకు ప్రభుత్వ సాయం సరిగా అందలేదని తప్పుబట్టారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఇళ్లల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉందని లేఖలో వివరించారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇవ్వాలని, బాధిత ప్రాంతాలకు 3నెలల ఉచిత విద్యుత్ ఇవ్వాలని లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు.


అల్లూరి జిల్లా వరద ప్రాంతాల్లో చంద్రబాబు రెండు రోజులు పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే ముంపు మండలాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతానని అన్నారు. ప్రతి ఒక్క నిర్వాసితుడికీ పరిహారం, పునరావాసం కల్పించడమే కాదు.. భూమికి భూమి ఇస్తామని.. వారి గ్రామాలను సురక్షితంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్తవారికి కూడా ప్యాకేజీ ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. వరదతో సర్వస్వం కోల్పోయిన వారికి నాలుగు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళాదుంపలు ఇచ్చారని, అవి కూడా పాడైపోయినవి ఇచ్చారని మండిపడ్డారు. వరదల్లో సర్వస్వం కొల్పోయిన వారి  చేతిలో రూ.రెండు వేలు పెడితే సరిపోతుందా అని చంద్రబాబు నిలదీశారు.

Read more