వైసీపీ మహిళా కార్పొరేటర్ల మధ్య ఫ్లెక్సీల వివాదం

ABN , First Publish Date - 2022-11-30T08:48:33+05:30 IST

వైసీపీ మహిళా కార్పొరేటర్ల మధ్య ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. కొత్తపేట శాస్త్రి సెంటర్‌లో కార్పొరేటర్ హేమ సురేష్ ఫ్లెక్సీ‌ని ఏర్పాటు చేశారు.

వైసీపీ మహిళా కార్పొరేటర్ల మధ్య ఫ్లెక్సీల వివాదం

ఏలూరు: వైసీపీ మహిళా కార్పొరేటర్ల మధ్య ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. కొత్తపేట శాస్త్రి సెంటర్‌లో కార్పొరేటర్ హేమ సురేష్ ఫ్లెక్సీ‌ని ఏర్పాటు చేశారు. తన డివిజన్‌లో హేమ సురుష్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై.. 40వ డివిజన్ కార్పొరేటర్ తుమరాడ స్రవంతి అభ్యంతరం వ్యక్తం చేశారు. హేమ సురుష్‌ ఫ్లెక్సీని తొలగిస్తే.. తన పుట్టినరోజు ఫ్లెక్సీని.. ఏర్పాటు చేసుకుంటానని కార్పొరేషన్ అధికారులకు స్రవంతి సమాచారం ఇచ్చారు. అర్థరాత్రి శాస్త్రి సెంటర్‌లో ఇరు వర్గాలు భారీగా మోహరించాయి. ఫ్లెక్సీ‌ని అధికారులు తొలగించడంపై హేమ సురేష్ అభ్యంతరం తెలిపారు. వివాదం కొనసాగుతుండగానే అక్కడే కేక్ కట్ చేసి.. కార్పొరేటర్ స్రవంతి పుట్టినరోజు జరుపుకున్నారు.

Updated Date - 2022-11-30T08:48:33+05:30 IST

Read more