ఆర్థిక సంఘ నిధులు పంచాయతీలకు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-09-13T09:15:55+05:30 IST

15వ ఆర్థిక సంఘ నిధులను తక్షణం గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవిధంగా ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు....

ఆర్థిక సంఘ నిధులు పంచాయతీలకు ఇవ్వాలి

విజయవాడ సెప్టెంబరు 12, (ఆంధ్రజ్యోతి): 15వ ఆర్థిక సంఘ నిధులను తక్షణం గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవిధంగా ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఏఈపీ పంచాయతీ పరిషత్‌, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా సర్పంచుల సంక్షేమ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈమేరకు ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ దివేదికి ఆయా సంఘాల అధ్యక్షులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ పంచాయతీ పరిషత్‌ అధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ. 948.35 కోట్లు రెండు విడతల వారీగా విడుదల చేసిందని పేర్కొన్నారు. ఆ నిధులను విద్యుత్‌ చార్జీల కింద సర్దుబాటు చేసే విధంగా ఆర్థిక శాఖ ఇచ్చిన యూవో నోట్‌, జీవోలను రుద్దు చేయాలని కోరారు. 

Read more