అమరావతి టూ అరసవిల్లి వరకు మహా పాదయాత్ర.. ప్రత్యేక ఆకర్షణగా సూర్య భగవానుడి రథం

ABN , First Publish Date - 2022-09-12T04:18:05+05:30 IST

అమరావతి టూ అరసవిల్లి వరకు రైతులు మహా పాదయాత్ర చేపట్టనున్నారు. సోమవారం ఉదయం నుంచి ఈ యాత్ర ప్రారంభంకానుంది..

అమరావతి టూ అరసవిల్లి వరకు మహా పాదయాత్ర.. ప్రత్యేక ఆకర్షణగా సూర్య భగవానుడి రథం

అమరావతి: అమరావతి టూ అరసవిల్లి వరకు రైతులు మహా పాదయాత్ర చేపట్టనున్నారు. సోమవారం ఉదయం నుంచి ఈ యాత్ర ప్రారంభంకానుంది. మహా పాదయాత్ర కోసం రథం సిద్ధమైంది. సూర్య భగవానుడి రథానికి‌ సూచికగా ఎదురు ఏడు గుర్రాలను ఏర్పాటు చేశారు. రథం లోపల అలివేలు మంగమ్మ, పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. చుట్టూ స్థంభాలు, తోరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. రథం ముందు, వెనుక సీపీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అమరావతిలో ఈ రథం ప్రత్యేక ఆకర్షణ‌గా నిలిచింది. విజయవాడకు చెందిన ప్రసాద్ ఆధ్వర్యంలో రథానికి రూపకల్పన చేశారు. 


Read more