నకిలీలతో మోసపోయా.. ఆదుకోండి..లేక పోతే ఆత్మహత్యే శరణ్యం..

ABN , First Publish Date - 2022-06-07T12:13:43+05:30 IST

‘నకిలీ విత్తనాలతో నిండా మునిగిపోయాను. కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేస్తే నకిలీలతో రూ.లక్షల్లో నష్టపోయాను. విచారణ జరిపించి న్యాయం చేయాలి

నకిలీలతో మోసపోయా.. ఆదుకోండి..లేక పోతే ఆత్మహత్యే శరణ్యం..

గుంటూరు: ‘నకిలీ విత్తనాలతో నిండా మునిగిపోయాను. కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేస్తే నకిలీలతో రూ.లక్షల్లో నష్టపోయాను. విచారణ జరిపించి న్యాయం చేయాలి. లేక పోతే ఆత్మహత్యే శరణ్యం..’ అంటూ వట్టిచెరుకూరు మండలం నెహ్రూనగర్‌ పల్లెకు చెందిన రైతు చండూరు ప్రభుదాసు సోమవారం కలెక్టరేట్‌లో నిరసన తెలిపారు. తనకు జరిగిన నష్టంపై కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో జేసీ రాజకుమారికి ఫిర్యాదు చేశారు. అనంతరం కావేరి విత్తనాలకు సంబంధించిన కవర్లను సమావేశ మందిర ప్రాంగణంలో నేలపై గుట్టగా పోసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 30 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని కావేరి విత్తనాల కంపెనీకి చెందిని మొక్కజొన్న విత్తనాలతో   పంట సాగు చేసినట్లు తెలిపారు. అవి నకిలీ విత్తనాలు కావడంతో దారుణంగా మోసపోయినట్లు ఆరోపించారు. ఏటా ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్లు వరకు దిగుబడి వస్తుందని, మొదటి సారిగా ఈ విత్తనాలతో పంట వేశానని ఎకరానికి 5 క్వింటాలు మాత్రమే దిగుబడి వచ్చిందని దీంతో ఆ విత్తనాల వల్ల మోసపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వచ్చిన దిగుబడిని రూ.1850 మాత్రమే కొనుగోలు చేశారని, లక్షల్లో నష్టపోయానని వాపోయారు.   

Read more