ప్రజల కోసం ఎన్నికేసులైనా భరిస్తాం

ABN , First Publish Date - 2022-09-25T09:50:18+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు గత నెలలో కుప్పంలో పర్యటించిన సమయంలో వైసీపీ నేతలు నానా రగడ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. పోలీసులు వారిని వదిలేసి.. టీడీపీ నేతలపై లాఠీ చార్జి చేయడమే

ప్రజల కోసం ఎన్నికేసులైనా భరిస్తాం

బెయిల్‌పై విడుదలైన గౌనివారి సహా నేతలు


చిత్తూరు, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు గత నెలలో కుప్పంలో పర్యటించిన సమయంలో వైసీపీ నేతలు నానా రగడ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. పోలీసులు వారిని వదిలేసి.. టీడీపీ నేతలపై లాఠీ చార్జి చేయడమే కాకుండా, 72 మంది నేతలపై కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు సహా కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలను అరెస్టు చేసి గత నెల 27న చిత్తూరు జిల్లా జైలుకు రిమాండ్‌కు పంపారు. వీరిలో ఆర్‌. సుబ్రమణ్యం అనే నాయకుడికి తప్ప మిగిలినవారికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో 27 రోజుల తర్వాత శనివారం వారు విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం టీడీపీ శ్రేణుల్ని చూసి గౌనివారి శ్రీనివాసులు భావోద్యేగానికి లోనయ్యారు. ప్రజల కోసం ఎన్ని కేసులై నా భరిస్తామని, ఎన్ని రోజులైనా జైల్లో ఉంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.  

Read more