జాతీయరహదారిపై ఏనుగు హల్‌చల్‌

ABN , First Publish Date - 2022-09-28T08:48:15+05:30 IST

చిత్తూరుజిల్లా పలమనేరు సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఒంటరి ఏనుగు సందడి చేసింది. గాంధీనగర్‌ క్రాస్‌ వద్ద

జాతీయరహదారిపై ఏనుగు హల్‌చల్‌

పలమనేరు, సెప్టెంబరు 27: చిత్తూరుజిల్లా పలమనేరు సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఒంటరి ఏనుగు సందడి చేసింది. గాంధీనగర్‌ క్రాస్‌ వద్ద  సమీపంలోని అడవి నుంచి రోడ్డు మీదకు వచ్చిన ఏనుగు నింపాదిగా కాసేపు నిలబడి రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోయింది. ఆ దారిలో వెళ్తున్న వాహనాలన్నీ ఆగిపోయాయి.  వారం కిందట ఇదే విధంగా రోడ్డు దాటుతున్న ఒంటరి ఏనుగును కారు ఢీకొంది. మూడు రోజుల కిందట కూడా రాత్రి పలమనేరు మున్సిపాలిటీలోని గంటావూరు వద్దకు వచ్చిన నాలుగు ఏనుగుల గుంపు అక్కడినుంచి పట్టణంలోని ఓంశక్తి గుడి వద్దకు వెళ్లి అక్కడినుంచి కీలపట్ల అటవీ ప్రాంతానికి వెళ్లిపోయాయి. 

Read more