రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైపోయింది: యనమల

ABN , First Publish Date - 2022-01-04T01:45:43+05:30 IST

రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైపోయిందని, వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఎనకనామిక్‌ గ్రోత్‌ అధఃపాతాళానికి పోయిందని

రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైపోయింది: యనమల

రాజమహేంద్రవరం: రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైపోయిందని, వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఎనకనామిక్‌ గ్రోత్‌ అధఃపాతాళానికి పోయిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని రక్షించడం కోసం కేంద్రం ఆర్టికల్‌ 360ని వినియోగించాలన్నారు. ‘‘ఆర్థిక వ్యవస్థను డెవలప్‌ చేసుకోవాలి. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా ఎవరు పరిపాలించినా ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవలసిన బాధ్యత ఉంది. కానీ  జగన్‌ ఆర్థిక వ్యవస్థను కూడా ధ్వంసం చేస్తున్నారు. టీడీపీ హయాంలో డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ రేట్‌ ఉంటే, ఇవాళ నెగిటివ్‌ గ్రోత్‌రేట్‌లోకి వెళ్లింది. దీనికి ఉదాహరణ ఏంటంటే నెలకు రాష్ట్ర ప్రభుత్వం ఏడువేల కోట్ల అప్పు చేయడమే. రాబోయే రోజుల్లో ఆదాయం మరింత పడిపోతుంది. దాంతో  రెవెన్యూ వ్యయాలు పడిపోతాయి’’ అని రామకృష్ణుడు పేర్కొన్నారు.

Updated Date - 2022-01-04T01:45:43+05:30 IST